ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం ముగిసింది. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణతో 12 రోజులుగా సాగిన యుద్ధానికి తెపడింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారాయి. అయితే, ఈ యుద్ధంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ని అంతమొందించాలనుకున్నట్లు ఇజ్రాయెల్ తాజాగా ప్రకటించింది. అయన కోసం తీవ్రంగా గాలించినట్లు తెలిపింది.

అయితే, ఖమేనీ అత్యంత సురక్షితమైన బంగర్‌లోకి వెళ్లిపోవడంతో ఆ ప్రయత్నం విఫలమైనట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ తెలిపారు. కాట్జ్ మాట్లాడుతూ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని అంతం చేయాలనుకున్నాం. ఇందుకోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశాం. కానీ, అతను అత్యంత సురక్షితమైన ప్రాంతానికి వెళ్లిపోవడంతో మా కార్యాచరణకు అవకాశం లేకుండాపోయింది. ఆయన మాకు అందుబాటులో ఉండి ఉంటే, బయటకు తెచ్చే వాళ్లం. ఖమేనీ కోసం తీవ్రంగా గాలించాం అని కాట్జ్ పేర్కొన్నారు.
