సౌదీ అరేబియా ప్రభుత్వం వీసాల మార్పిడికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకోంది. ఇళ్లల్లో పని చేయడానికి వచ్చే భారతీయులు, ఇతర విదేశీయులు ఇకపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీసాలు మార్చుకోవచ్చు. ఇప్పటి వరకు ఉన్న చట్టం ప్రకారం యాజమానికి అంగీకారం ఉంటేనే వీసాను మార్చుకోవడానికి వీలుంటుంది. అయితే యాజమానులు అంగీకరించని కారణంగా వందలాది మంది తెలుగు డ్రైవర్లు, ఇతర పని మనుషులు ఇతర ప్రాంతాలకు వెళ్లడానికిగానీ, మరో ఉద్యోగంలో చేరడానికి గానీ అవకాశం ఉండేది కాదు. ఇక నుంచి మూడు సందర్భాల్లో యాజమాని ఆమోదం అవసరం లేకుండా విదేశీయులు తమ ఉద్యోగాలు మార్చుకోవచ్చు. మూడు నెలల పాటు క్రమంగా వేతనం చెల్లించకపోవడం, దేశంలోకి వచ్చిన 15 రోజుల వరకు అఖమా ఇవ్వకపోవడం. అఖమా గడువు ముగిసిన ఒక నెలలోపూ దాన్ని రెన్వువల్ చేయకపోవడం. ఇలాంటి పరిస్థితులు ఎదురయినప్పుడు విదేశీ ఉద్యోగి తాను పని చేస్తున్న యాజమాని సమ్మతితో సంబంధం లేకుండా ఇతర చోట ఉద్యోగంలో చేరవచ్చు. ఒక వేళ స్వదేశానికి తిరిగి వెళ్లాలనుకుంటే వెళ్లిపోవచ్చని అధికార వర్గాలు తెలిపాయి.














