ప్రపంచ వికలాంగుల దినోత్సవం డిసెంబర్ 3 సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో దివ్యాంగులకు అనేక రకాలుగా సేవలు అందిస్తున్న తానా ఫౌండేషన్ కు మరొక గొప్ప గుర్తింపు లభించింది.
గత కొన్ని సంవత్సరాలుగా తానా ఆదరణ కార్యక్రమం ద్వారా కోట్లాది రూపాయలను దాతల సహాయంతో ట్రై సైకిల్స్, బ్యాటరీ ట్రై సైకిల్స్, మూడు చక్రాల మోటారు వాహనాలను ,వీల్ ఛైర్స్ ను అవసరం అయిన వారికి లప్తోప్లను అందిస్తున్న తానా వారి సేవలను గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం TANA FOUNDATION ను బెస్ట్ NGO గా గుర్తింపుతో సన్మానించింది.
వేదిక మీద శ్రీ రవి సామినేని మాట్లాడుతూ మాతృదేశం మీద మమకారంతో అమెరికా లో స్థిరపడిన తెలుగువారు అనేక సేవా కార్యక్రమాలకు కోట్లాది రూపాయలను తానా అధ్యక్షులు శ్రీ అంజయ్య చౌదరి లావు, తానా ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ యార్లగడ్డ వెంకట రమణ గారి నేతృత్వంలో వికలాంగుల సహయార్ధం అందిస్తున్నామని వివరించారు. తానా సేవలను అభినందిస్తూ తెలంగాణ రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు తానా ఫౌండేషన్ సేవలను అంజయ్య చౌదరి లావు గారిని వెంకటరమణా యార్లగడ్డ గారిని ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న రవి సామినేని గారి సేవలను కొనియాడారు.తానా ఫౌండేషన్ ప్రతినిదిగా హాజరైన రవి సామినేని గారిని శాలువాతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. తానా ఫౌండేషన్ సేవలు మారుమూల గ్రామాల్లో ఉన్న దివ్యాంగులకు సైతం మనోధైర్యాన్ని కలిగి కలిగించే విధంగా ఉండాలని ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీమతి దివ్య దేవరాజా అన్నారు.
ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన డైరెక్టర్ ఆఫ్ డిజేబుల్ వెల్ఫేర్ శ్రీమతి శైలజ గారు మరింత మెరుగైన సౌకర్యాలు వికలాంగులకు కల్పించడానికి తానా మరియు ఇతర ఎన్నారైల సహాయం మరింత అవసరమని అభ్యర్థించారు. వారి సేవలను కొనియాడారు