Namaste NRI

ఇది అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధం : పోప్

ఉక్రెయిన్‌లో మారణహోమాన్ని ఆపాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను పోప్‌ ఫ్రాన్సిస్‌ వేడుకున్నారు.  సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో వేలాది మందిని ఉద్దేశించి పోప్‌ మాట్లాడారు. యుద్ధం తీవ్రరూపం దాల్చి అణుబాంబులతో దాడులు చేసుకునే పరిస్థితి వచ్చేట్టు ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని నెలలుగా ఉక్రెయిన్‌లో జరుగుతున్న రక్తపాతం తనను వెంటాడుతోందని అన్నారు. యుద్దం వల్ల సొంత ప్రజల ప్రేమను కూడా పుతిన్‌ కోల్పోతున్నారని పేర్కొన్నారు. యుద్ధం ఆపేందుకు రష్యా శాంతి ప్రతిపాదనలు చేస్తే దయచేసి అంగీకరించాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెల్‌న్‌స్కీని కోరారు. రష్యాతో శాంతి చర్చలకు సుముఖంగా ఉండాలని సూచించారు. రెండు దేశాల యుద్ధం కారణంగా ప్రపంచదేశాలపై కూడా తీవ్ర ప్రభావం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌ ప్రాంతాలను పుతిన్‌ రష్యాలో విలీనం చేయడం సరికాదని అన్నారు. ఇది అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events