ఖలిస్తానీ తీవ్రవాదుల కారణంగా కెనడా కలుషితమవుతోందని భారత సంతతి ఎంపీ చంద్ర ఆర్య అన్నారు. స్థానిక చట్టాలు అందించిన స్వేచ్ఛను వారంతా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఇదే సమయం లో ఎడ్మంటన్‌లో హిందూ దేవాలయంపై ఖలిస్థానీ మద్దతుదారులు చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండిం చారు. ఇటీవల వేర్పాటువాద నేత గురుపత్వంత్ సింగ్ పన్నూన్ ఓ వీడియోలో తనతో పాటు సన్నిహితులను భారత్‌కు వెళ్లిపోవాలంటూ హెచ్చరించడంపై చంద్ర ఆర్య స్పందించారు.
హిందువులమైన మేము ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుంచి కెనడాకు వచ్చి స్థిరపడ్డాం. దక్షిణాసియాలోని ప్రతి దేశం, ఆఫ్రికా, కరేబియన్‌లోని అనేక దేశాల నుంచి, ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి ఇక్కడ కు వచ్చాం. కెనడా సామాజిక – ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషించాం. ఇక్కడ మా సేవలు కొనసాగుతూనే ఉంటాయి. చరిత్ర కలిగిన భారత సంస్కృతి, వారసత్వం ద్వారా కెనడా బహుళ సంస్కృతిక సంప్రదాయాల ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాం. కెనడా ఇచ్చిన హక్కులను ఖలిస్తానీ మద్దతుదారులు దుర్వినియోగం చేస్తు న్నారు. అలాంటి వారి కారణంగానే కెనడా కలుషితమవుతోంది అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.