ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (ఐరాస)లో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేకపోవడాన్ని అమెరికన్ టైకూన్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తాజాగా స్పందించారు. ఈ మేరకు ఐరాస విధానాలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఈ భూమ్మీద అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ ఉన్నప్పటికీ, భద్రతా మండలిలో ఆ దేశానికి శాశ్వత సభ్యత్వం లేకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ మేరకు ఐరాస, దాని అనుబంధ సంస్థల్లో మార్పులు అవసరమన్నారు. ఐరాస, దాని అనుబంధ సంస్థల్లో మార్పులు అవసరం. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్‌కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. శక్తిమంతమైన దేశాలు తమ స్థానాలను వదులుకునేందుకు ఇష్టపడట్లేద. ఇదే సమస్యకు కారణమవుతోంది. ఆఫ్రికా యూనియన్‌కు సమష్టిగా ఒక శాశ్వత సభ్యత్వం ఇవ్వాలన్నారు.