
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం ముగిసిన విషయం తెలిసిందే. రెండు దేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంతో గత 12 రోజులుగా సాగిన యుద్ధం ముగిసింది. దీంతో పశ్చిమాసియాలో కూడా ఉద్రిక్తతలు కాస్త చల్లారాయి. ఇప్పుడిప్పుడే అన్ని కార్యకలాపాలూ మొదలయ్యాయి. ఇంతలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం మళ్లీ రావొచ్చేమో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ రెండు దేశాలతో నేను మాట్లాడి ఉద్రిక్తతలను పరిష్కరించాను. ప్రస్తుతం ఆ రెండు దేశాలూ అలసిపోయాయి. అవి మళ్లీ యుద్ధాన్ని ప్రారంభిస్తాయా? అంటే ఏదో ఒకరోజు అది సాధ్యమేనని నేను అనుకుంటున్నా. ఇది త్వరలోనే ప్రారంభం కావొచ్చు కూడా అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
