సుమంత అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్య హోప్ కలిసి నటించిన చిత్రం ఇతే మా కథ తాజాగా ప్రేక్షకులు మందుకు వచ్చింది. గురు పవన్ దర్శకుడు. జీ మహేష్ నిర్మించారు. ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గురు పవన్ మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత నాకు మంచి విజయం దక్కింది. దర్శకుడు చిత్రాన్ని ఎంతో బాగా తెరకెక్కించారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని మెచ్చుకుంటున్నారు అన్నారు. దాదాపు రెండేళ్లు కష్టపడి చేసిన చిత్రమిది. దీన్ని ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారా? అని టెన్షన్ పడ్డాం. ఇప్పుడు వాళ్ల ప్రశంసలతో మా రెండేళ్ల కష్టాన్ని మర్చిపోయామన్నారు సుమంత్ అశ్విన్. దర్శకుడు మాట్లాడుతూ ఎన్నో రోజుల నుంచి థియేటర్లకు దూరంగా ఉన్న మహిళల్ని థియేటర్లకు రప్పించాలని ప్రయత్నం చేశాం అందులో సక్సెస్ అయ్యాం. ఈ చిత్రాన్ని అద్భుతమైన ఆదరణ దక్కుతోందన్నారు. మా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఇంకా ఎంతో దూరం వెళ్లాల్సి ఉంది. ఇంత మంచి విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్ అన్నారు నిర్మాత. ఈ కార్యక్రమంలో సుమంత్ అశ్విన్, జి.మహేష్ పాల్గొన్నారు.