అమెరికాను కనుగొన్నది క్రిస్టోఫర్ కొలంబస్ కాదని, భారతీయ పూర్వీకులేనని మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఇందర్‌సింగ్ పర్మార్ వ్యాఖ్యానించారు. భారత్‌ను కనుగొన్నది వాస్కోడిగామా అన్నది కూడా తప్పేనని అన్నారు. భారత గొప్ప యోధుడైన వాసులూన్ 8వ శతాబ్ధంలోనే అమెరికాకు వెళ్లారు. శాన్‌టియాగోలో అనేక దేవాలయాలు నిర్మించారు. ఇప్పటికీ ఆ నిజాలు అక్కడి మ్యూజియంలో భద్రంగా ఉన్నాయి. వాస్కోడిగామా భారత్‌ను కనిపెట్టాడన్నదీ తప్పే, పుస్తకాల్లో తప్పుగా రాశారు అని పేర్కొన్నారు.