Namaste NRI

ఆ విమానాన్ని రష్యానే కూల్చేసింది.. కానీ

కజకిస్థాన్‌లో కూలిపోయిన విమానాన్ని రష్యా కూల్చేసిందని, అయితే అది ఉద్దేశపూర్వక చర్య కాదని అజర్‌బైజాన్‌ ప్రెసిడెంట్‌ ఇల్హామ్‌ అలియెవ్‌  చెప్పారు. దీనిని కూల్చేసినట్లు చెప్పకుండా, ఆ అంశాన్ని కప్పిపుచ్చడానికి రష్యా ప్రయత్నించిందని విమర్శించారు. రష్యా భూమిపై నుంచి ఈ విమానంపై దాడి చేశారని తెలిపారు. రష్యన్‌ అధికారులు కొన్ని రోజులపాటు రకరకాల కథనాలను చెప్తుండటం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. తమకు క్షమాపణ చెప్పి, ఈ దారుణానికి బాధ్యులను కఠినంగా శిక్షించాలని రష్యాను డిమాండ్‌ చేసినట్లు చెప్పారు. ఈ విమానం కూలిపోవడంతో దీనిలో ఉన్న 67 మందిలో 38 మంది మరణించారు. దీనిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ క్షమాపణ చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events