ప్రపంచ చరిత్రలోనే అది పెద్ద ఉగ్రవాద దాడి అయిన న్యూయార్క్ 9/11 ఘటనకు ఇరవయ్యేళ్లు నిండిన సందర్భంగా బాధిత దేశం అమెరికాలో పాటు ప్రపంచ దేశాలు నాటి ఘటనను గుర్తు చేసుకున్నాయి. ఆతాహుతి దశం అల్‌ఖైదా ఉగ్రవాదులు ప్రయాణికుల విమానాలను హైజాక్ చేసి, రాజధాని వాషింగ్టన్‌లో ఉన్న పెంటగాన్ భవనాన్ని, న్యూయార్క్ నడిబొడ్డున ఉన్న వరల్డ్ ట్రేడ్ టవర్స్‌ను ఢీకొట్టి నేలమట్టం చేసిన ఘటన ప్రపంచ దేశాలను దిగ్భ్రాంతి పరచింది. 9/11 ఘటన ఇరవయ్యేళ్ల స్మృతిని అమెరికా ఏకతాదినంగా జరుపుకొంది. నాటి ఘటనలో మూడు వేల మందికి పైగా మరణించారు. 9/11 ఘటన తర్వాత అమెరికా జాతిలో పెల్లుబికిన సహకార స్ఫూర్తిని జాతి తిరిగి ప్రదర్శించాలన్నారు. ఉగ్రవాద దాడి జరిగిన మూడు ప్రాంతాలను సందర్శించారు. అయితే ఎక్కడా జో బైడెన్ మాట్లాడలేదు.