దక్షిణాది సినీరంగంలో నయనతార-ధనుష్ మధ్య నెలకొన్న వివాదం హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. నయనతార జీవితం ఆధారంగా రూపొందించిన నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యు మెంటరీ విషయంలో మొదలైన వివాదం మరింత జటిలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యం లో కర్మ సిద్ధాంతాన్ని ఉదహరిస్తూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో నయనతార పెట్టిన పోస్ట్ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. కర్మ సిద్ధాంతం ఏం చెబుతుందంటే, అబద్ధాలతో పక్కవారి జీవితాన్ని నువ్వు ధ్వంసం చేస్తే, దానిని ఓ అప్పుగా భావించు. అది సరైన సమయంలో వడ్డీతో సహా నీ దగ్గరకే వస్తుంది అంటూ నయనతార తన పోస్ట్‌లో పేర్కొంది. ధనుష్‌ను ఉద్దేశించే ఆమె ఈ పోస్ట్‌ను పెట్టిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక ధనుష్-నయనతార వివాదం పూర్వపరాల్లోకి వెళితే నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంట రీలో నయనతార నటించిన నానుమ్ రౌడీ దాన్ సినిమా వీడియోలను కొన్నింటిని వాడుకున్నారు.