ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో అత్యవసర పరిస్థితి విధించింది. పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో అధ్యక్షుడు గొటబయ రాజపక్స ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రజలకు రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణ, అత్యవసర సరుకులు, సేవల నిర్వహణ కోసం ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించారు. దేశంలో గత కొన్ని రోజులుగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రోజుకు 13 గంటలకు పైగా కరెంట్ కోత విధిస్తున్నారు. దీంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళనలకు దిగారు.














