Skip to main content

Namaste NRI

అక్కడ అధికార మార్పిడి జరగడం మంచిది : డొనాల్డ్ ట్రంప్

ఇరాన్‌లో అధికార మార్పిడి జరగడం మంచిదని, అది జరగవచ్చునని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే ఇరాన్‌పై సైనిక చర్యకు దిగే విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. ఉత్తర కరోలినాలోని ఫోర్ట్‌ బ్రాగ్‌లో ఉన్న సైనిక దళాలను కలుసుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య చేశారు. మధ్యప్రాచ్య జలాలలోకి రెండో యుద్ధ విమాన వాహక నౌకను తరలిస్తున్నామని అంతకుముందు ఆయన ధృవీకరించారు. ఇరాన్‌లో ఇస్లామిక్‌ మతాధికారిని పదవీచ్యుతుడిని చేసేందుకు ఒత్తిడి తెస్తారా అని పాత్రికేయులు ప్రశ్నించగా అక్కడ అధికార మార్పిడి జరగడం మంచిది. అది జరగవచ్చు. 47 సంవత్సరాలుగా వారు మాట్లాడుతూనే ఉన్నారు అని ట్రంప్‌ అన్నారు.

Social Share Spread Message

Latest News