Namaste NRI

హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ ఘన విజయం

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్‌ ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌పై 24,068 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కౌంటింగ్‌ మొదలైనప్పటి నుంచి చివరి వరకూ ఈటల ఆధిక్యంలోనే కొనసాగారు. ఎనిమిదో రౌండ్‌,  11వ రౌండ్‌లో మాత్రం గెల్లు స్వల్ప ఆధిక్యం కనబర్చారు. పోస్టల్‌ ఓట్లలో బీజేపీకి 242, టీఆర్‌ఎస్‌కు 455, కాంగ్రెస్‌కు 2 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు 1,07,022 ఓట్లు, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌కు 83,167, కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు 3,014 ఓట్లు వచ్చాయి. ఈటల విజయం సాధించడంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events