అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం. ఏ.ఆర్. మోహన్ దర్శకుడు. రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ నెల 25న విడుదల కానుంది. ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ ఇది సీరియస్ సినిమా అని చాలా మంది అనుకుంటున్నారు. అది నిజం కాదు. ఇందులో నలభైశాతం కామెడీ ఉంటుంది. మిగతా కథ ఎమోషనల్‌గా సాగుతుంది అన్నారు. ఈ సినిమాలో నేను టీచర్‌గా కనిపిస్తా. చక్కటి సామాజిక సందేశంతో ఆకట్టుకుంటుంది అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ ఈ సినిమా 17 ఏళ్ల కల. ప్రజల జీవితాన్ని తెరపై చూపాలనే కోరికతో ఈ కథ రాసుకున్నా. తప్పకుండా అందరిని మెప్పిస్తుంది అని తెలిపారు. ఈ సినిమా విజయవంతం చేసి నిర్మాతగా తన మొదటి ప్రయత్నాన్ని ఆశీర్వదించాలని నిర్మాత రాజేష్ దండా కోరారు. ఈ కార్యక్రమంలో మోహన్ కృష్ణ ఇంద్రగంటి, అబ్బూరి రవి, వి.ఐ. ఆనంద్, విజయ్ కనకమేడల, వశిష్ట, తిరుమల కిశోర్, అభిషేక్ అగర్వాల్, నాంది సతీష్ వర్మ తదితరులు పాల్గొన్నారు.
