అమీర్, ప్రణీత, దీపిక జంటగా పూదారి రాజా గౌడ్, పూదారి రాజశేఖర్ గౌడ్, బాచిన నాగేశ్వరరావు నిర్మిస్తున్న సినిమా ఇట్లు. మీకు తెలుసా.. అనేది ఉపశీర్షిక. పందిళ్లపల్లి రోషిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర టీజర్, ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథిగా నటుడు సుమన్ హాజరయ్యారు. ప్రతాని రామకృష్ణగౌడ్, సాయివెంకట్, కుప్పిలి శ్రీనివాస్, రామసత్య నారాయణ, ఉప్పల మెట్టయ్య, పెంచలస్వామి, నారాయణరావు, ప్రతాప్‌రెడ్డి, అనిల్ బుజ్జి వేడుకకి హాజరయ్యారు. సుమన్ మాట్లాడుతూ కృష్ణంరాజు సలహాలతోనే ఇప్పటివరకు పరిశ్రమలో ఉన్నాను. ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. ఇందులో నేనొక పోలీస్ అధికారిగా నటించాం. సస్పెన్‌నస థ్రిల్లర్‌గా ఓ మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది అన్నారు. దర్శక నిర్మాతలు మాట్లాడుతూ సస్పెన్స్, థ్రిల్లర్ కథతో రూపొందించిన చిత్రమిది. ఆకట్టుకునే ప్రేమ కథ ఉంటుంది. మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రామరాజు, నిమ్మ గోపి, సంగీతం: శివ `ప్రణయ్.














