Namaste NRI

మెగా ఫ్యాన్స్ కి పండుగే..అదిరిపోయే అప్ డేట్

మెగా ఫ్యాన్స్ కి పండుగే..అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు మేకర్స్.  మెగాస్టార్‌ చిరంజీవి న‌టిస్తున్న తాజా చిత్రాల్లో ఒకటి మెగా 154.  బాబీ (కేఎస్ ర‌వీంద్ర‌) దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా మేకర్స్‌ దీపావళి సందర్భంగా టైటిల్‌ టీజర్‌ను ప్రకటించారు. ముందు నుంచి వస్తున్న వార్తల ప్రకారం ఈ చిత్రానికి వాల్తేరు వీరయ్య టైటిల్‌నే ఫిక్స్‌ చేశారు మేకర్స్‌.పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రంలో ర‌వితేజ కీలక పాత్రలో నటిస్తున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో శృతిహాస‌న్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న వాల్తేరు వీరయ్య 2023 జనవరి 13న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.  ఇక ఇందులో చిరు లుక్‌ కనిపించకపోయినా.. ఆయన సిగరేటు తాగుతూ కనిపించారు. ఈ అప్డేట్‌ తో మెగా ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

Social Share Spread Message

Latest News