Skip to main content

Namaste NRI

అది పాన్‌ ఇండియా సమస్య …ఆ ఒక్కటీ అడక్కు అంటున్న అల్లరి నరేశ్‌

అల్లరి నరేశ్‌ నటిస్తున్న తాజా చిత్రం ఆ ఒక్కటీ అడక్కు.. ఫరియా అబ్దుల్లా కథానాయిక. మల్లి అంకం దర్శకుడు. రాజీవ్‌ చిలక నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్‌తోపాటు ఫస్ట్‌ లుక్‌, గ్లింప్స్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఆ ఒక్కటీ అడక్కు సినిమా ఇప్పటికీ చాలామందికి అభిమాన చిత్రం. ఇప్పుడు ఆయన తనయుడు అల్లరి నరేశ్‌ అదే పేరుతో సినిమా చేయడం ఇక్కడ ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం. ఇందులో గణ అనే పాత్రను పోషిస్తున్నారు నరేశ్‌. అతని పెళ్లి గురించి ఇంట్లోవాళ్లూ, బయట మిత్రు లు అడగడంతో ఆ ఒక్కటీ అడక్కు అని పెళ్లి అనేది పాన్‌ ఇండియా సమస్య అని చెప్పడం గ్లింప్స్‌లో హైలైట్‌. వచ్చే నెల 22న విడుదల చేస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.  ఈ చిత్రానికి కెమెరా సూర్య, సంగీతం: గోపీసుందర్‌.

Social Share Spread Message

Latest News