అమెరికాలోని కాలిఫోర్నియా గవర్నర్ గెవిన్ న్యూసమ్ కులవివక్ష వ్యతిరేక బిల్లును తిరస్కరించారు. ఇది అనవసరమైన బిల్లు అని, కులవివక్షను నిషేధిస్తూ రాష్ట్రంలో ఇప్పటికే చట్టాలు ఉన్నాయని పేర్కొన్నారు. పౌరులు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడ నివసిస్తున్నారు? అనేదానితో సంబంధం లేకుండా కాలిఫోర్నియాలో ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించేందుకు అర్హులని తాము విశ్వసిస్తామని అని గెవిన్ పేర్కొన్నారు. లింగం, జాతి, రంగు, మతం, జాతీయత పలు ఇతర అంశాల ఆధారంగా ఉండే అన్ని రకాల వివక్షను కాలిపోర్నియా ఇప్పటికే నిషేధించింది. కుల ఆధారిత వివక్షపై కూడా ఈ క్యాటగిరీల కింద నిషేధం ఉన్నది. కాబట్టి ఈ బిల్లు అవసరం లేదు అని అందులో స్పష్టం చేశారు. కుల వివక్ష వ్యతిరేక బిల్లును కాలిఫోర్నియా రాష్ట్ర అసెంబ్లీ ఇటీవల ఆమోదించిన విషయం తెలిసిందే.