Namaste NRI

అబ్బాయిలు, అమ్మాయిలే కాదు.. అంతా కలిసి చూసే సినిమా

మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా ట్రూ లవర్. ఈ సినిమాను మిలియన్ డాలర్ స్టూడియోస్, ఎంఆర్‌పీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై నజేరత్ పసీలియన్, మగేష్ రాజ్ పసీలియన్, యువరాజ్ గణేషన్ నిర్మించారు. ఓ విభిన్న ప్రేమ కథగా దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ రూపొందించారు. ఈ సినిమాను డైరెక్టర్ మారుతి, సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్‌కేఎన్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా ట్రూ లవర్ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా నిర్మాత ఎస్‌కేఎన్‌ మాట్లాడుతూ తమిళ ప్రీమియర్స్‌ చూసిన వాళ్లు ఇటీవలకాలంలో ఇలాంటి గొప్ప ప్రేమకథ రాలే దని చెబుతున్నారు. రిలీజ్‌కు ఒక రోజు ముందుగానే పెయిడ్‌ ప్రీమియర్స్‌ వేస్తున్నాం. నేటితరం ప్రేమ జంటల్లో ఉండే అభద్రతా భావాన్ని, సంఘర్షణను ఈ సినిమాలో భావోద్వేగభరితంగా ఆవిష్కరించారు. 200 థియేటర్లలో విడుదల చేస్తున్నాం అన్నారు.

దర్శకుడు మారుతి మాట్లాడుతూ ట్రూ లవర్ సినిమా కథను దర్శకుడు చాలా జెన్యూన్‌గా తెరకెక్కించాడు. అబ్బాయిలు, అమ్మాయిలే కాదు ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా ఇది. ఈ సినిమాతో ఈ వాలెంటైన్స్ డే మర్చిపోలేకుండా ఉంటుందని చెప్పగలను”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో మణికందన్, హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ, ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి పాల్గొన్నారు.నేటి యువతకు కనెక్ట్‌ అయ్యే చిత్రమిదని నిర్మాత వంశీ నందిపాటి తెలిపారు. తమిళ ప్రీమియర్స్‌కు అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తున్నదని నాయకానాయికలు తెలిపారు. ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress