అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక, ఇజ్రాయెల్‌ను సందర్శించారు. భర్త జారెడ్ కుష్నర్‌తో కలిసి బందీల కుటుంబాలను పరామర్శించారు. అక్టోబర్ 7 నాటి హమాస్ దాడి అనాగరిక చర్య అని విమర్శించారు. హమాస్ కిడ్నాప్ చేసిన కుటుంబాలతోపాటు గాజాలో ఇంకా బందీలుగా ఉన్న బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించినట్లు చెప్పారు. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్న పలువురు రాజకీయ నేతలను కూడా తాము కలిసినట్లు వెల్లడించారు.
కాగా, అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో సుమారు 1,200 మంది ఇజ్రాయెల్ పౌరులు మరణించగా వందలాది మందిని బందీలుగా గాజాకు పట్టుకెళ్లారు. ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఆర్మీ బాంబు దాడుల్లో గాజాలో ఇప్పటి వరకు 20,000 మందికిపైగా మరణించారు.