Namaste NRI

జేడీ వాన్స్‌కు నిరసన సెగ.. ఉక్రెయిన్‌ అనుకూల ప్లకార్డులు ప్రదర్శించిన అమెరికన్లు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మధ్య తీవ్ర వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌లో ఖనిజాల వెలికితీత, రష్యాతో యుద్ధం ముగింపునకు సంబంధించి శ్వేత సౌధంలో ఇద్దరు నేతల మధ్య జరిగిన సమావేశంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇద్దరు నేతలు మీడియా, పలువురు దౌత్యవేత్తల సమక్షంలో రష్యా యుద్ధం గురించి గొడవవడ్డారు. జెలెన్‌స్కీ అనుసరిస్తున్న వైఖరిపై ట్రంప్‌తో పాటు ఉపాధ్యాక్షుడు జేడీ వాన్స్‌  కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వీరి మధ్య ఘర్షణ అనంతరం అమెరికా అంతటా ఉక్రెయిన్‌ అనుకూల నిరసనలు వెళ్లువెత్తుతున్నాయి. న్యూయార్క్‌, లాస్‌ ఏంజెల్స్‌, బోస్టన్‌లో వందలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ఉక్రెయిన్‌కు మద్దతుగా ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. అమెరికా స్టాండ్స్‌ విత్‌ ఉక్రెయిన్‌, బి స్ట్రాంగ్‌ ఉక్రెయిన్‌ ప్లకార్డులను ప్రదర్శించారు.

ఈ క్రమంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌కు నిరసన సెగ తగిలింది. జేడీ వాన్స్‌ తన కుటుంబంతో కలిసి స్కీ హాలిడే కోసం వెర్మోంట్‌ కు వెళ్లారు. అక్కడ స్థానికులు ఉక్రెయిన్‌ అనుకూల ప్లకార్డులను పట్టుకుని ఉపాధ్యక్షుడికి స్వాగతం పలికారు. ఉపాధ్యక్షుడి పర్యటనను వ్యతిరేకిస్తూ వెర్మోంట్‌లోని వెయిట్స్‌ఫీల్డ్‌లో వందలాది మంది నిరసనకారులు ఒకచోట చేరి నిరసన తెలిపారు. వెర్మోంట్ స్టాండ్‌ విత్‌ ఉక్రెయిన్‌  వంటి ప్లకార్డులతోపాటు ఉక్రేనియన్‌ జెండాలను ప్రదర్శించారు. ఈ నిరసనలతో వాన్స్‌ కుటుంబం స్కీ రిసార్ట్‌ నుంచి తెలియని ప్రదేశానికి వెళ్లాల్సి వచ్చింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events