
తమిళనాడు మధురై గ్రామీణ నేపథ్యంలో పొట్టేళ్ల పోరాటం చుట్టూ నడిచే కథతో రూపొందించిన చిత్రం జాకీ. డా॥ ప్రగభల్ దర్శకత్వం. ఈ చిత్రానికి ప్రేమకృష్ణదాస్, సి.దేవదాస్, జయ దేవదాస్ నిర్మాతలు. చెన్నైలో టీజర్‌ను విడుదల చేశారు. మధురై పరిసర ప్రాంతాల్లోని సంప్రదాయ పోట్టేలు పోటీల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించా మని, ప్రతీ సన్నివేశం ఎంతో సహజంగా ఉంటుందని, సంప్రదాయ క్రీడను నేటి తరానికి చూపిస్తున్నామని చిత్రబృందం పేర్కొంది. త్వరలో ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. యువన్‌కృష్ణ, రిదాన్ కృష్ణాస్, అమ్ము అభిరామి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి శక్తి సంగీతాన్నందించారు. ఈ సినిమా ద్వారా గ్రామీణ జీవితం, ప్రజల భావోద్వేగాలు, సంప్రదాయ క్రీడను సహజంగా ప్రేక్షకులకు చూపించనున్నారు. టీజర్ విడుదలతో ఈ సినిమా ప్రయాణం మొదలైంది. మరిన్ని విషయాలు త్వరలోనే వెల్లడిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.















