అమెరికాలోని మిషిగన్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ కొన్నేళ్ల క్రితం లాటరీలో జాక్‌పాట్ కొట్టినట్టు కలగంది. ఆ కలలో లాటరీలో 25 వేల డాలర్లు ఆమె సొంతమయ్యాయి. మరుసటి రోజు ఆ కల గురించి తలుచుకుని నవ్వుకుంది. కొన్నాళ్లకు ఆ విషయాన్నే మర్చిపోయింది. అయితే ఇటీవల కాష్‌వర్డ్ మల్లిప్లయర్ స్క్రాచ్ ఆఫ్ గేమ్ ఆడుతున్న సందర్భంలో ఏకంగా 3 లక్షల డాలర్ల జాక్ పాక్ కొట్టింది. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే ఈ మొత్తం దాదాపు 2.3 కోట్ల రూపాయలతో సమానం. నేను అప్పట్లో 25వేల డాలర్ల లాటరీ తగిలినట్టు కలగంటే ఇప్పుడు ఏకంగా 3 లక్షల డాలర్లు లాటరీ వరించింది. నా కల నిజమైందనాలో నిజం కాలేదనాలో అర్థం కావట్లేదు అని ఆమె వ్యాఖ్యానించింది. ఇందులో కొంత మొత్తంతో ఇల్లు కొంటానని పేర్కొన్న ఆమె మిగతా మొత్తాన్ని భవిష్యత్తు కోసం పెట్టుబడి పెడతానని పేర్కొంది. అయితే తన పేరు, ఇతర వివరాలు మాత్రం వెల్లడిరచేందుకు ఆమె ఇష్టపడలేదు.