అదృష్టం అంటే ఆమెదే. తాను ప్రయాణించాల్సిన విమానం రద్దు కావడంతో ఉబుసుకు పోక లాటరీ టికెట్ కొంది. స్క్రాచ్ చేసి చూసిన ఆమెకు నోట మాటరాలేదు. అది కలకాదని, నిజమేననుకొని ఆనందంతో ఉబ్చితబ్బిబ్బయింది. ఆ లాటరీ ద్వారా ఆమె గెలుచుకుంది 10 లక్షల అమెరికా డాలర్లు. మన కరెన్సీలో చెప్పాలంటే రూ.7.4 కోట్లు. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన 51 ఏళ్ల ఏంజిలా కారవెల్లా అనే మహిళదీ అదృష్టం. విమానం రద్దవడంతో ఏదో అనుకోనిది జరగబోతోందని ఊహించానని, అయితే లాటరీ తగిలి ఇంత పెద్దమొత్తంలో డబ్బు వస్తుందని అనుకోలేదని ఏంజిలా చెప్పారు. డబ్బంతా ఒకేసారి తీసుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడంతో 7.9 లక్షల డాలర్లను (రూ.5.85 కోట్లు) ఆమె చేతికొచ్చాయి.