లాటరీ టికెట్ల విషయానికొస్తే బంపరాఫర్ కోట్ల మందిలో ఒక్కరినే వరిస్తుంటుంది. కువైత్‌లో ఓ భారతీయుడికి అదృష్టం వరించింది. మహజూజ్ డ్రాలో గత కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా పాల్గొంటున్నాడు. దాంతో ఇన్నాళ్లకు అతడికి అదృష్టం వరించి తాజాగా జాక్‌పాట్ కొట్టాడు. ఏకంగా 20 మిలియన్ల దిర్హమ్స్ గెలుచుకున్నాడు. మన కరెన్సీలో అక్షరాల రూ. 44.44కోట్లు. ఈ నెల 19న దుబాయ్‌లో నిర్వహించిన డ్రాలో భారత్‌కు చెందిన దలీప్ (48) అనే వ్యక్తికే ఈ జాక్‌పాట్ తగిలింది. కువైత్‌లో మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేసే దలీప్ (48) గత కొన్నేళ్లుగా మహజూజ్ రాఫెల్‌లో పాల్గొంటున్నాడు. కానీ, ఇప్పటివరకు ఏనాడు పెద్దగా గెలిచింది లేదు. అప్పడప్పుడు చిన్న అమౌంట్ మాత్రమే గెలిచేవాడు. అయిన ఏమాత్రం నిరాశకు గురికాకుండా లాటరీలో క్రమం తప్పకుండా పాల్గొంటూనే వస్తున్నాడు. ఇలాగే ఇటీవల అతడు కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌కు తాజాగా జాక్‌పాట్ తగిలింది. ఏకంగా రూ.44.44కోట్లు గెలుచుకున్నాడు. అంతే.. దలీప్ ఆనందానికి అవధుల్లేవు. అర్జెంట్‌గా తాను చేస్తున్న ఉద్యోగం మానేసి వరల్డ్ టూర్ వేసే ప్లాన్‌లో ఉన్నానని దలీప్ చెప్పాడు.
