కేరళ లోని ఓ ఆటోడ్రైవర్ నక్క తోకను తొక్కాడు. అదృష్ట దేవత అతడిని లాటరీ రూపంలో కరుణించింది. దీంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. కేరళలోని శ్రీవరాహం ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ అనూప్‌కు ఓనమ్ బంపర్ లాటరీలో రూ.25కోట్ల జాక్‌పాట్ తగిలింది. మలేసియా వెళ్లి చెఫ్‌గా స్థిరపడాలనుకుని ఏర్పాట్లు చేసుకుంటున్న ఇతడు 22 ఏళ్లుగా లాటరీ టికెట్లు కొని అదృష్టం పరీక్షించుకున్నాడు. ఈ టిక్కెట్‌ను తిరువనంతపురంలోని పజవంగడి భగవతి ఏజెన్సీ విక్రయించినట్లు తెలుస్తోంది.అన్ని పనులు పోను అనూప్ చేతికి రూ.15 కోట్లు అందుదాయని నిర్వాహకులు చెప్పారు. ఈ డబ్బుతో అప్పులు తీర్చి, ఇల్లు కట్టుకుంటుకొని, బంధువులకు సాయం చేసేందుకు వినియోగిస్తానని అనూప్ తెలిపాడు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)