Skip to main content

Namaste NRI

డొనాల్డ్‌ ట్రంప్ ఫ్యామిలీకి జాక్ పాట్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గత ఏడాది తన కుటుంబ క్రిప్టో వెంచర్ల ద్వారా 1.4 బిలియన్‌ డాలర్లకు పైగా ఆదాయం పొందారు. ట్రంప్‌ ప్రభుత్వ ఎథిక్స్‌ కార్యాలయానికి గత సంవత్సరపు ఆదాయ పత్రాలను సమర్పించారు. ట్రంప్‌ అవలంబించిన విధానాల కారణంగా డిజిటల్‌ ఆస్తులు ప్రయోజనం పొందాయని, వాటి నుంచే ఆయన తన ఆదాయంలో అధిక భాగాన్ని పొందారని ఆ పత్రాలను బట్టి తెలుస్తోంది. ట్రంప్‌, ఆయన కుమారులు కలిసి స్థాపించిన క్రిప్టో వెంచర్‌ వరల్డ్‌ లిబర్టీ ఫైనాన్షియల్ ద్వారా అధ్యక్షుడి కంపెనీలు దాదాపు 800 మిలియన్‌ డాలర్లు అందుకున్నాయి. ఈ ఆదాయాన్ని ట్రంప్‌ తన కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. ఇందులో క్రిప్టో టోకెన్ల అమ్మకాల ద్వారా 520 మిలియన్‌ డాలర్లు, వరల్డ్‌ లిబర్టీ ఫైనాన్షియల్‌ వెంచర్‌ వ్యాపారంలోని వాటాల అమ్మకం ద్వారా 250 మిలియన్‌ డాలర్లకు పైగా ఆదాయం సమకూరింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events