అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు భారత విద్యార్థులు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది వేసవిలోనే రికార్డు స్థాయిలో 82 వేల వీసాలను జారీ చేసినట్లు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడిరచింది. గతంలో ఎన్నడూ ఈ స్థాయిలో వీసాలు జారీ చేయలేదని.. మరే ఇతర దేశానికి కూడా ఇంత ప్రాధాన్యం ఇవ్వలేదని తెలిపింది. మే నుంచి ఆగస్టు వరకు ఢల్లీిలోని అమెరికా ఎంబసీతో పాటు చైన్నె, హైదరాబాద్, కోల్‌కతా, ముంబయి కాన్సులేట్‌లు అర్హత కలిగిన విద్యార్థుల దరఖాస్తులను పరీక్షించి సాద్యమైనన్ని ఎక్కువ వీసాలు జారీ చేసినట్లు అమెరికా రాయబార కార్యాలయం వెల్లడిరచింది. దీంతో ఆయా యూనివర్సిటీల్లో షెడ్యూల్‌లోగా చేరేందుకు విద్యార్థులకు వీలు కలిగిందన్నారు.
ఉన్నత విద్య కోసం భారతీయ కుటుంబాలు అమెరికా సంయుక్త రాష్ట్రాలనే ఎంచుకుంటున్నాయన్న విషయాన్ని తాజా గణాంకాలు రుజువు చేస్తున్నాయని అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధి పాట్రిసియా లాసినా వెల్లడిరచారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావడంతోపాటు అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని భారత విద్యార్థులు తోడ్పాటు ఎంతో అవసరమన్నారు. అమెరికా వెళ్లే అంతర్జాతీయ విద్యార్థుల్లో భారత్ విద్యార్థుల వాటా 20 శాతంగా ఉంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఓపెన్ డోర్స్ నివేదిక 2021 ప్రకారం, 2020`21 విద్యా సంవత్సరంలో 1,67,582 భారతీయ విద్యార్థులు అమెరికా వెళ్లారు. తాజాగా ఈ ఏడాది వేసవిలోనే 82 వేల విద్యార్థి వీసాలు జారీ చేసినట్లు తెలిపింది.