
ఆంధ్రప్రదేశ్ నుంచి దుబాయ్ వెళ్లిన ఎలక్ట్రీషియన్ బోరుగడ్డ నాగేంద్రమ్ (46)ను అదృష్ట దేవత వరించింది. కొన్ని సంవత్సరాలుగా పొదుపు చేస్తున్న ఆయనకు దాదాపు రూ.2.25 కోట్లు నగదు బహుమతి లభించింది. సేవింగ్స్ స్కీమ్ చందాదారులకు లక్కీ డ్రా నిర్వహించగా, అందులో ఆయన విజేతగా నిలిచారు. నాగేంద్రమ్ మాట్లాడుతూ తాను 2017లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు వచ్చానని చెప్పారు. తన కుటుంబానికి, పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వాలనే ఆకాంక్షతో తాను ఇక్కడికి వచ్చానని చెప్పారు. తాను 2019 నుంచి నేషనల్ బాండ్స్‌లో పొదుపు చేస్తున్నానని తెలిపారు.
