అమెరికాలోని ఉత్తర కరొలినాలోని డ్యూక్‌లో ఉండే 84 ఏండ్ల మరియన్, స్థానికంగా ఉన్న మినీ మార్కెట్‌కు రోజూ వెళ్తుంటారు. రెగ్యులర్ కస్టమర్ అయిన ఆమెతో షాపు క్యాషియర్ వాల్టర్ చనువుగా ఉండేవాడు. ఈ నేపథ్యంలో ఒక లాటరి టికెట్ కొనమని ఆమెకు నచ్చజెప్పాడు. ఆ లాటరీ తగిలితే 5,00,000 డాలర్లు (రూ.3.71 కోట్లు) జాక్‌పాట్‌గా పొందవచ్చని చెప్పారు. దీంతో మరియన్ అతడి నుంచి ఒక లాటరీ టికెట్‌ను కొనుగోలు చేసింది. అయితే మరియన్ కొన్న ఫాంటసీ 5 లోట్టో టికెట్‌కు 300 డాలర్ల (రూ.22,303) ప్రైజ్ మనీ వచ్చింది. అయినప్పటికీ అందులో సగం మొత్తాన్ని క్యాషియర్ వాల్టర్‌కు ఇవ్వాలని ఆమె నిర్ణయించుకున్నది. మరునాడు వాల్టర్ గెలిచాడు అన్న పేరున్న రెండు బెలూన్లతో ఆ మినీ సూపర్ మార్కెట్‌కు మరియన్ వెళ్లింది. అతడిని ఆశ్చర్య పరడచంతో పాటు ఒక కవర్లో ఉంచిన సగం లాటరీ బహుమతిని ఇచ్చింది. అంతేగాక వాల్టర్‌ను కొనియాడుతూ అతడిని దగ్గరకు తీసుకుని హత్తుకున్నది. దీంతో షాపులోని మిగతా సిబ్బంది చప్పట్లతో మరియన్ చర్యను అభినందించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)