Skip to main content

Namaste NRI

ప్రవాస భారతీయుడికి జాక్‌పాట్

దుబాయిలో  ప్రవాస భారతీయుడికి అదృష్టం వరించింది. తన బర్త్‌డే  నాడు కొనుగోలు చేసిన లాటరీ టికెట్ అతనికి కోట్లు తెచ్చిపెట్టింది.  సకిల్ ఖాన్ సర్వర్ ఖాన్  అనే భారత ప్రవాసుడు ఉద్యోగం కోసం 2011లో దుబాయి వెళ్లాడు. అక్కడ ఓ ప్రైవేట్ కంపెనీలో ఇంజనీరింగ్ కోఆర్డినేటర్‌గా జాబ్ చేస్తున్నాడు. నెలకు అతడి శాలరీ రూ.90వేలు. అయితే, అతడు తన కొంతమంది స్నేహితులతో కలిసి 2015 నుంచి అబుదాబి బిగ్ టికెట్‌లో క్రమం తప్పకుండా లాటరీ టికెట్ కొనుగోలు చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. ఈ క్రమంలో జూలై 25న తన పుట్టినరోజున నం.191115 లాటరీ టికెట్ కొన్నాడు. తాజాగా నిర్వహించిన బిగ్ టికెట్ డ్రాలో సకిల్ కొనుగోలు చేసిన లాటరీ టికెట్ నంబర్‌కు జాక్‌పాట్ తగిలింది. విజేతగా నిలిచిన అతడు 15 మిలియన్ దిర్హమ్స్ (రూ. 33.76కోట్లు) గెలుచుకున్నాడు.

Social Share Spread Message

Latest News