ప్రభుత్వ పింఛన్ దారులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్ర ప్రభుత్వ పింఛన్‌దారులకు 3.144 శాతం డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంపు చేసిన 3.144 శాతం డీఏను 2019 జనవరి 1 నుంచి వర్తింప చేస్తున్నట్లు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2021 జూలై నుంచి పెంపుదల చేసిన డీఏతో కలిపి పింఛన్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే బకాయిలో ఉన్న డీఏను వాయిదా రూపంలో చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ పెంపుతో 38.776 శాతానికి డీఏ పెరగనుంది.