జగపతిబాబు తాజాగా ఓ హిందీ చిత్రంలో నటిస్తున్నారు. సల్మాన్‌ఖాన్ బావమరిది ఆయుష్‌వర్మ నాలుగో చిత్రంలో ఆయన నటించనున్నారు. ఈ విషయాన్ని ఆయుష్‌శర్మ వెల్లడిరచారు. భాషలతో సంబంధం లేకుండా నేను సినిమాలను అభిమానిస్తాను. నాకు జగపతిబాబు సార్ నటన గురించి తెలుసు. ఆయన పోషించిన పాత్రలంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఆయన నా నాలుగో చిత్రంలో నటించడం ఆనందంగా ఉంది అని తెలిపారు ఆయుష్. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కునున్న ఈ సినిమాలో జగపతిబాబు పాత్ర కథాగమనంలో కీలకంగా ఉంటుందని, 2023లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చిత్ర బృందం పేర్కొంది. సుశ్రీమిశ్రా, విద్యా మాలపడే, జస్విందర్ గార్డనర్, రాశుల్ టాండన్ నటిస్తున్నారు. ఈ చిత్రాని కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. కాత్యాయన్ శివపురి దర్శకుడు. ఈ చిత్రానికి కెమెరా: జి.శ్రీనివాసరెడ్డి, సంగీతం: విశాల్, తనిష్క్, చెట్టాస్, దర్శకత్వం: కాత్యాన్ శివపురి.
