
అమెరికాలో మరో భారతీయుడికి కీలక పదవి దక్కింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్‌కు డైరెక్టర్‌గా ఇండియన్-అమెరికన్ డాక్టర్ జై భట్టాచార్యను ప్రెసిడెంట్ ఎలక్ట్ డొనాల్డ్ ట్రంప్ ఎంపిక చేశారు. ఇది అమెరికా లో అత్యున్నత స్థాయి హెల్త్ రీసెర్చ్, ఫండింగ్ ఇన్‌స్టిట్యూషన్. అత్యున్నత స్థాయి పరిపాలన పదవికి ట్రంప్ ఎంపిక చేసిన తొలి ఇండియన్ అమెరికన్ జై భట్టాచార్య. ఈ పదవికి డాక్టర్ జైని ఎంపిక చేయడం థ్రిల్లింగ్‌గా ఉందని ట్రంప్ అన్నారు. డాక్టర్ రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ జూనియర్‌తో కలిసి జై దేశ వైద్య పరిశోధన, ముఖ్యమైన ఆవిష్కరణలకు నాయకత్వం వహిస్తారని చెప్పారు. అమెరికాను మళ్లీ ఆరోగ్యవంతంగా తయారు చేయడానికి వీరిద్దరూ కృషి చేస్తారన్నారు. డాక్టర్ జై భట్టాచార్య స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో హెల్త్ పాలసీ ప్రొఫెసర్. నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనమిక్స్ రీసెర్చ్‌లో రీసెర్చ్ అసోసియేట్.
