
రాజ్ తరుణ్ కథానాయకుడిగా రూపొందుతోన్న క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ పాంచ్ మినార్. రామ్ కుడుముల దర్శకుడు. మాధవి, ఎం.ఎస్.ఎం.రెడ్డి నిర్మాతలు. త్వరలో సినిమా విడుదల కానుంది. ప్రమోషన్‌లో భాగంగా ఈ సినిమాలోని రెండో పాటను మేకర్స్ విడుదల చేశారు. జాను మేరీ జాను అంటూ సాగే ఈ పాటను శ్రీహర్ష ఈమని రాయగా, శేఖర్‌చంద్ర స్వరపరిచారు. వినాయక్ ఆలపించారు. రాజ్ తరుణ్, కథానాయిక రాశి సింగ్ కెమిస్ట్రీ ఈ పాటలో ఆసక్తికరంగా ఉంది. అజయ్‌ఘోష్, బ్రహ్మాజీ, శ్రీనివాసరెడ్డి, నితిన్ ప్రసన్న, రవివర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆదిత్య జవ్వాది, సమర్పణ: గోవిందరాజు, నిర్మాణం: కనెక్ట్ మూవీస్ ఎల్ ఎల్ పి
