Namaste NRI

దీపావళి కానుకగా జపాన్

కార్తీ ప్రధానపాత్రలో రూపొందుతున్న చిత్రం జపాన్‌. రాజు మురుగన్‌ దర్శకుడు. ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు కలిసి నిర్మిస్తున్నారు.  ఈ చిత్రంలో కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో కార్తీ లుక్‌ని విడుదల చేశారు. ఒక చేత్తో గన్‌నీ, ఒక చేత్తో గ్లోబ్‌నీ పట్టుకొని ఫస్ట్‌లుక్‌లో వైరైటీగా కనిపిస్తున్నాడు కార్తీ. ఫస్ట్‌లుక్‌ మాదిరిగానే కథలో కూడా కొత్తదనం ఉంటుందని,త్వరలోనే టీజర్‌ని కూడా విడుదల చేయనున్నామని మేకర్స్‌ తెలిపారు.   సునీల్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ తొలిసారిగా నటిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.ఈ చిత్రం దీపావళికి విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News