ఓ సామాన్యుడిని జపాన్ యువరాణి మాకో ఎట్టకేలకు పెళ్లి చేసుకుంది. మూడేళ్ల నిరీక్షణ తర్వాత జపాన్ రాకుమారి మకో తన ప్రేమను గెలిపించుకుని ప్రియుడిని పెళ్లి చేసుకుంది. ప్రేమ కోసం రాచరికపు హోదాను వదిలి ప్రియుడు కొమరోను పెళ్లాడిరది. టోక్యో ఇంపీరియల్ ప్యాలెస్లో మకో కొమురోల వివాహం నిరాడంబరంగా జరిగింది. జపాన్ చక్రవర్తి నరుహిటో తమ్ముడు అకిషినో కుమార్తే అయిన మకో.. టోక్యో ఇంటర్నేషనల్ క్రిస్టియన్ యూనివర్సిటీలో చదువుకుంది. అక్కడే తనతో పాటు చదువుకునే సామాన్యుడు కొమురోను ఇష్టపడిరది. కొమురోతో మాకోకు ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. కొమురోను వివాహం చేసుకుంటానని 2017లో మాకో ప్రకటించింది. ఆర్థిక సమస్యల కారణంగా పెళ్లి వాయిదా పడిరది.
జపాన్ రాజ కుటుంబ మహిళలు సామాన్యులను పెళ్లాడితే రాచరికాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సిద్డపడ్డ మకో రాజభరణం కింద తనకు వచ్చే రూ.10 కోట్ల (150 మిలియ్ యెన్లు) మొత్తాన్ని కూడా తిరస్కరించింది.














