డ్రైవర్‌లెస్ వాహనాలపై ఇప్పటికే చాలా కంపెనీలు పరిశోధనలు తీవ్రం చేసిన నేపథ్యంలో జపాన్‌కు చెందిన పరిశోధకులు మరో అడుగు ముందుకు వేశారు. సాధారణ మనిషిలాగే కారు డ్రైవ్ చేసే రోబోను అభివృద్ధి చేశారు. ముసాషి అని నామకరణం చేసిన ఈ రోబో డ్రైవర్, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కార్లనే డ్రైవ్ చేస్తుందని యూనివర్సిటీ ఆఫ్ టోక్యో పరిశోధకులు తెలిపారు. హ్యాండ్ బ్రేక్ వాడటం, ఇగ్నిషన్ కీ ఆన్ చేయటం, పెడల్స్ తొక్కడం, స్టీరింగ్ తిప్పడం, ఇండికేటర్లు వాడటం లాంటి పనులు కూడా చేస్తుందని వెల్లడించారు.
రోబో కళ్లలో హై రిజల్యూషన్ కెమెరాలు ఉంటాయని, వీటిని ఏఐ సిస్టమ్స్‌కు అనుసంధానం చేసినట్టు వివరించారు. ప్రస్తుతానికి ఈ రోబో గంటలకు 3 మైళ్ల వేగంతో ముందుకు, కుడి వైపు మాత్రమే చూసి నడపగలదని, త్వరలోనే సాధారణ మనిషిలా డ్రైవ్ చేసేలా శిక్షణ ఇస్తామని పరిశోధకులు పేర్కొన్నారు.