జపాన్ టెన్నిస్ స్టార్ నవోమి ఒసాకా మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. బాడీ షాక్‌కు గురవడంతో డబ్ల్యూటీఏ టోర్నమెంట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. వెరోనికా కుదెర్మెతోవాతో జరగాల్సిన సెమీ ఫైనల్ మ్యాచ్‌కు నవోమి దూరమైంది. మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా ఆట నుంచి విరామం కోరుకుంటున్నట్లు ప్రకటించింది. ఆమె బరిలోకి దిగక పోవడంతో వెరోనికా ఫైనల్‌కు చేరుకుంది. ఇక నేడు జరిగే ఫైనల్లో రెండో సీడ్ సిమోనా హలెప్‌తో వెరోనికా తలపడనుంది. ఇక త్వరలో ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా ఓపెన్‌లో మాత్రం తాను పాల్గొంటానని ఒసాకా స్పష్టం చేసింది.
23 ఏళ్ల ఒసాకా తన కెరీర్‌లో మొత్తం ఏడు సింగిల్స్ టైటిల్స్ సాధించగా, అందులో నాలుగు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉండటం విశేషం. 2018లో అమెరికా దిగ్గజం సెరెనా మిలియమ్స్‌ను ఓడిరచి యూఎస్ ఓపెన్‌లో విజేతగా నిలిచిన ఒసాకా 2019, 2021లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను, 2020లో యూఎస్ ఓపెన్ టైటిల్‌ను సొంతం చేసుకుంది.