సాయి వెంకట్, జో శర్మ, సుమన్, ప్రవళ్లిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా జయహో రామానుజ. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ విడుదల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రసాద్ ల్యాబ్‌లో జరిగిన కార్యక్రమంలో నిర్మాత వడ్లపట్ల మోహన్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ ప్రసన్నకుమార్, టిఎఫ్‌సీసీ ప్రెసిడెంట్ కొల్లి రామృకృష్ణ, సెన్సార్ బోర్డు మెంబర్ అట్లూరి రామకృష్ణ తదితరులు మాట్లాడారు. అనంతరం నటుడు సాయి వెంకట్ మాట్లాడుతూ రామానుజాచార్యుల జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. హైదరాబాద్, శ్రీరంగం, బెంగళూరు లొకేషన్‌లలో చిత్రీకరణ జరిపాం. 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ నెల 15వ తేదీ నుంచి తిరుపతి, బెంగళూరులో మూడో షెడ్యూల్ షూటింగ్ చేయబోతున్నాం. రెండు భాగాలుగా ఈ సినిమా ఉంటుంది. మొదటి భాగం విజయదశమికి, రెండో భాగాన్ని మే 5న రామానుజ జయంతి సందర్భంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ఈ చిత్రాన్ని సుదర్శనం ప్రొడక్షన్స్ పతాకంపై సాయి వెంకట్ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. సాయి ప్రసన్న, ప్రవళ్లిక నిర్మాతలు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)