సత్య మేరుగు, దీపిక జంటగా రూపొందుతున్న చిత్రం జయం. జి.కిరణ్‌కుమార్ దర్శకుడు. కంటూరు రవి కుమార్ చౌదరి నిర్మాత. ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్ లాంచ్ చేశారు. టి. ప్రసన్నకుమార్, పీపుల్ మీడియా శ్రీధర్, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ అతిథులుగా పాల్గొన్నారు.కథ విన్నప్పుడు అప్పటి జయం మాదిరిగానే ఈ జయం కూడా విజయం సాధిస్తుంది అనిపించిందని, అనుకున్న దానికంటే అద్భుతంగా సినిమా వస్తున్నదని నిర్మాత తెలిపారు. లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం కచ్చితం గా విజయం సాధిస్తుందని దర్శకుడు నమ్మకం వ్యక్తం చేశాడు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)