జయం రవి హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం జెనీ. భువనేశ్ అర్జునన్ దర్శకత్వం. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. లాంగ్ హెయిర్‌తో ఛేజింగ్ మూడ్‌లో ఉన్న జయం రవిని చైన్ రౌండప్ చేస్తూ కనిపిస్తుండగా, డబ్బు, గోల్డ్ కాయిన్, ఐస్ క్రీమ్ ఉండటం చూడొచ్చు. ఆసక్తికరంగా ఉన్న లుక్‌లో కనిపి స్తున్న జయం రవి ఇంతకీ ఈ సారి ఎలాంటి స్టోరీతో రాబోతున్నాడనేది తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్, వామికా గబ్బి, కృతిశెట్టి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నట్టు సమాచారం. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.ఈ చిత్రాన్ని వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై డాక్టర్ ఇషారీ కే గణేశ్ నిర్మిస్తున్నారు. మావీరన్ ఫేం స్టంట్ కొరియోగ్రఫర్ యానిక్ బెన్ పనిచేస్తుండటంతో అంచనాలు పెరిగిపోతున్నాయి.