Namaste NRI

రామ్ చరణ్ రిలీజ్ చేసిన జయమ్మ పంచాయతీ ఫస్ట్ లుక్

బుల్లితెర వ్యాఖ్యాతగా ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న ప్రముఖ యాంకర్‌ సుమ కనకాల ఇప్పుడు వెండి తెరపై సందడి చేయనుంది.గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రానికి సంబంధించిన టైటిల్‌ మరియు ఫస్ట్‌ లుక్‌ను రామ్‌ చరణ్‌ విడుదల చేశారు. సినిమా పేరు జయమ్మ పంచాయతీ. ఈ సినిమాలో సుమ కనకాల ఎంతో ఇంటెన్సిటితో కనిపిస్తున్నారు. పూర్వకాలంలో మాదిరి రోలు, రోకలి పట్టుకుని సుమ కనిపిస్తున్నారు. సుమ రోకలి దెబ్బకు పగళ్లు రావడం కూడా ఈ పోస్టర్‌లో చూడొచ్చు. ఇక ఆమె కొంగును చూస్తే గ్రామీణ వాతావరణానికి సంబధించిన అంశాలు కనిపిస్తున్నాయి. ఇందులో సుమ ఊరి పెద్దలా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఫస్ట్‌లుక్‌తో సినిమా మీద అంచనాలు పెంచేశారు.

                  ఈ సినిమా షూటింగ్‌  తుది దశలో ఉంది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాతలు తెలియజేశారు. వెన్నెల క్రియేషన్స్‌ పతాకంపై రాబోతోన్న ఈ చిత్రాన్ని బలగ ప్రకాష్‌ నిర్మిస్తున్నారు. విజయ్‌ కుమార్‌ కలివారపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కీరవాణి సంగీతం అందిస్తుండగా అనుష్‌ కుమార్‌ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events