
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధానికి తెరపడింది. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. దీంతో రెండు దేశాల మధ్య 12 రోజులుగా సాగిన యుద్ధం ముగిసింది. ఈ విషయాన్ని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో అణ్వాయుధాల విషయంలో టెహ్రాన్‌కు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. భవిష్యత్తులో అణ్వాయుధాలు తయారు చేయాలనుకుంటే అమెరికా సైన్యాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఒకవేళ భవిష్యత్తులో అణ్వాయుధాలను తయారు చేయాలని అనుకుంటే, వారు (ఇరాన్) అత్యంత శక్తివంతమైన అమెరికా సైన్యాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అని వాన్స్ హెచ్చరించారు.
