హైదరాబాద్‌లో యూఎస్ కాన్సులేట్ జనరల్‌గా జెన్నిఫర్ లార్సన్ పదవీ బాధ్యతలు చేపట్టారు. అమెరికా నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న ఆమెకు కాన్సులేట్ అధికారులు స్వాగతం పలికారు. జెన్నిఫర్ లార్సన్ గతంలో ముంబై లోని యూఎస్ కాన్సులేట్ జనరల్‌లో డిప్యూటీ ప్రిన్సిప్ ఆఫీసర్‌గా, భారతదేశ వ్యవహారాల తాత్కాలిక డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేశారు. దీంతో ఆమెకు భారత్‌తో ఎన్నో ఏండ్లుగా అనుంబంధం ఏర్పడిరది. తాజాగా హైదరాబాద్‌లో యూఎస్ కాన్సులేట్ జనరల్‌గా నియమితులైన ఆమె మూడు రాష్ట్రాలతో అమెరికా భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న యూఎస్ కాన్సులేట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు సంబంధించి అమెరికా దౌత్య కార్యకలాపాలను నిర్వహిస్తున్నది.














