మంచు విష్ణు హీరోగా నటిస్తున్న సినిమా జిన్నా. సన్నీలియోన్, పాయల్ రాజ్‌పుత్ నాయికలుగా నటిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి ఈషాన్ సూర్య దర్శకుడు. ఈ సందర్భంగా చిత్రంలో నటించిన అనుభవాలను తెలిపింది నాయిక పాయల్ రాజ్ పుత్ మాట్లాడుతూ మాస్ ఎంటర్‌టైనర్ చిత్రమిది. ఈ చిత్రంలో పల్లెటూరి యువతి స్వాతి పాత్రలో నటించాను. పచ్చళ్లు అమ్ముకుంటూ జీవిస్తుంటున్నాను. చాలా సహజంగా సాగే క్యారెక్టర్ ఇది. మంచు విష్ణు క్యారెక్టర్ ఎనర్జిటిక్‌గా ఉంటుంది. సినిమా మాగుంటేనే ఇవాళ ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు. లేకుంటే అదే డబ్బులతో ఓటీటీ సబ్ స్క్రిప్షన్ తీసుకుని మంచి కంటెంట్ చూస్తున్నారు మిమ్మల్ని నిరాశపర్చదు అని చెప్పింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని తెలుగు తమిళం, మలయాళం, హిందీ వంటి నాలుగు భాషల్లో ఈ నెల 21న గ్రాండ్ గా విడుదలవుతుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)