శ్రీకమల్, శివాని రాజశేఖర్ జంటగా నటిస్తున్న చిత్రం జిలేబి. కె. విజయ్‌భాస్కర్ దర్శకుడు. ఎస్ఆర్కే పతాకంపై గుంటూరు రామకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, మురళీశర్మ, గెటప్ శ్రీను, గుండు సుదర్శన్, బిత్తిరి సత్తి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను సీనియర్ హీరో వెంకటేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ ఇది నిజంగా స్వీట్ అకేషన్ అన్నారు. సినిమా కూడా జిలేబి లా స్వీట్‌గా ఉంటుందని నాకు నమ్మకం ఉందన్నారు. విజయభాస్కర్‌గారు నాకు ఇష్టమైన డైరెక్టర్ అన్నారు. జిలేబి తప్పకుండా ఒక ఫన్‌ఫుల్ ఎంటర్టైనర్ అవుతుందనే నమ్మకం ఉందన్నారు. నటడిగా పరిచయం అవుతున్న కమల్‌కు ఆల్ ది బెస్ట్ అని అన్నారు. ఇది అందరూ చూసే సినిమా అవుతుందన్నారు.దర్శకుడు కె.విజయ్ భాస్కర్ మాట్లాడుతూ కుటుంబమంతా కలిసి చూసే చిత్రమిది. మణిశర్మ చక్కటి పాటలిచ్చారు. ఈ సినిమా ద్వారా నా కుమారుడు శ్రీకమల్ను హీరోగా పరిచయం చేయడం ఆనందంగా ఉంది అన్నారు. అనంతరం హీరో శ్రీకమల్ మాట్లాడుతూఆద్యంతం హాస్యప్రధానంగా సాగే చిత్రమిదని అన్నారు. శివాని రాజశేఖర్ మాట్లాడుతూ వినోదంతో పాటు ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా అందరిని మెప్పిస్తుందన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల, సంగీతం: మణిశర్మ.
![](https://namastenri.net/wp-content/uploads/2023/04/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-17.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/04/4b3127df-f30c-4f25-9c19-7ecfdbd57b90-51-19.jpg)