Namaste NRI

కలియుగం పట్టణంలో నుంచి జో జో లాలీ అమ్మ సాంగ్ రిలీజ్

విశ్వ కార్తీక్‌, ఆయూషి పటేల్‌ జంటగా నటిస్తున్న చిత్రం కలియుగం పట్టణం.  రమాకాంత్‌రెడ్డి దర్శకుడు. కథ, కథనం, మాటలు కూడా ఆయనే అందిస్తుండటం విశేషం. కందుల చంద్ర ఓబుల్‌రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేశ్‌లు నిర్మాతలు. చిత్రాశుక్ల ప్రధాన పాత్ర పోషిస్తున్నది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా జో జో లాలీ అమ్మ అంటూ సాగే గీతాన్ని దర్శకుడు వశిష్ట విడుదలచేసి చిత్రయూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. భాస్కరభట్ల రాసిన ఈ పాటను అజయ్‌ అరసాడ స్వరపరచగా, అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. ఈ పాట సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్‌ చెబుతున్నారు. పోస్ట్‌ప్రొడక్షన్‌ కూడా చివరి దశకు చేరుకుందని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా చరణ్‌ మాధవనేని. ఈ  చిత్రం  మార్చి 22న సినిమా విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events